ప్రమీల ను చూడగానే , కవిత గబగబా ఆమె దగ్గరకి వెళ్ళి , “ ఏంటే ఇదీ ! టెన్షన్ అంటుందీ , మనతోనే మాట్లాడడానికి అమెరికా నుండి వచ్చిందీ అంటుందీ ..” అని అడుగుతుంటే , “ అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది . పద వెళ్దాం ..” అంటూ , లోపలకి వెళ్ళబోతుండగా , కల్పనే ఎదురొచ్చి , “ రండి రండి .. ఎక్కడా మీ అబ్బాయిలూ !?” అంటూ ఉండగా , రవీ రమేష్ లు ఆటోలకు డబ్బులు ఇచ్చి , అప్పుడే లోపలకి వస్తున్నారు . వాళ్ళని చూస్తూనే , “ అయితే నేను పొరబడలేదన్న మాట ..” అంది కవిత . ఆమె ఏమంటుందో వీళ్ళకి అర్ధం కావడం లేదు . “ అచ్చం అవే పోలికలు ..” అంది కల్పన తనలో తాను అనుకుంటున్నట్టు . అప్పుడు అర్ధమయింది వాళ్ళకి ఆమె దేని గురించి మాట్లాడుతుందో . లోపలకి నడిచి వస్తున్న కొడుకులను చూస్తుంటే , గొంతు తడారిపోతున్నట్టు ఉంది ప్రమీల , కవితలకు . అంతలో అక్కడకి వచ్చిన పిల్లల్లో రమేష్ ను చూసి , “ నీ పేరేంటి బాబూ !?” అడిగింది కల్పన ఆత్రంగా . “ రమేష్ ..” అన్నాడు వాడు ఆమెని విచిత్రంగా చూస్తూ .
All types of stories in all languages