ఇదిపూర్తి రొమేంటిక్ కథ. ఇన్ సెస్ట్గానీ, అడల్టరీ గానీ, బూతులు గానీఉండవు. ఇది ఒక అందమైనప్రేమకథ మాత్రమే. అయితే రొమేన్స్ మాత్రంపీక్స్ లో ఉంటుంది. ఇకచదవండి. హాయ్...నా పేరు నీరజ. వయసు ఇరవై ఏడు. పెళ్ళైఐదేళ్ళవుతుంది. మా ఆయన పేరువాసు. సినిమా హీరోలా బాగానే ఉంటాడు. అఫ్ కోర్స్, నేనుకూడా హీరోయిన్ లానే ఉంటాననుకోండి. మాజంటని ఎవరు చూసినా కుళ్ళుకుంటారు. అంత అందంగా ఉంటుంది మా జంట. పెళ్ళైనకొత్తలో హానీమూన్, తరువాత కొత్త సంసారం....అన్నీచాలా ఎక్జైటింగ్ గా జరిగిపోయాయి. సుమారునాలుగు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగో గత సంవత్సరంగా ఆఎంజాయ్ మెంట్ తగ్గిపోయింది. అంటేమా మధ్య సెక్స్ జరగడంలేదని కాదు. అది ఎక్జైటింగ్గా అనిపించడం లేదంతే. రొటీన్ గా సాగిపోతూ బోరింగ్గా ఉంటుంది. నాకు నచ్చడం లేదు. అదే విషయాన్ని ఆయనతో చెబితే, నవ్వేసి"ఒకరికొకరు పాతబడిపోయాం కదా. ఇక ఎక్జైటింగ్గా కనిపించడానికి ఏముంటుందే. ఇందులోనే ఆనందం వెతుక్కోవాలి." అనేసాడు. నాకువళ్ళు మండిపోయింది. ఇప్పుడు కొత్తమొగుడిని ఎక్కడ వెతుక్కోనూ? అందుకే"ఏదో ఒకటి చేయాలి." అనిడిసైడ్ చేసుకొని, నెట్ లో దీనికిసంబదించిన జవాబులు సెర్చ్ చేయసాగాను. ఎన్నో కథలు, మరెన్నోఎనాలసిస్ లూ. అన్నీ చదివినతరువాత, నాకో విషయం అర్ధమయింది. మగాడు కానీ, ఆడది కానీఅక్రమ సంబంధంలో కొత్త ఎక్జైట్ మెంట్పొందుతారనీ, అందుకే చాలా మంది దానికోసం అర్రులు చాచుతారనీ. నిజమే మరి, ఒకకొత్త వ్యక్తితో సెక్స్ కొత్తగానే ఉంటుంది కదా. అందుకే నేనూఅక్రమసంబంధం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నా. ఎవరితో పెట్టుకోవాలో కూడా డిసైడ్ అయిపోయా. ఆ వ్యక్తి ఎవరో కాదు, వాసు. అదేనండి మా ఆయన. మాఆయనతో నాకు అక్రమ సంబందంఏమిటనుకుంటున్నారా? అయితే నన్ను ఫాలోకండి. మీకే అర్ధమవుతుంది. డాబాపైన వెన్నెల్లో కూర్చొని ఆలోచించడం మొదలెట్టా. వేసవికాలం కావడంతో, పెరట్లోని మల్లెపందిరి శృంగార పరిమళాలని వెదజల్లుతుంది. వెన్నెల కాస్తంత చల్లగా ఉన్నా, మల్లెల వాసన తోడయ్యేసరికి వేడెక్కించడంమొదలెట్టింది. "ఈ రెంటికీ మధ్యఇదేం పాడు రసాయనచర్యో...?" అని విసుక్కున్నా. ఇంకాసేపు అక్కడే ఉంటే, "మదనుడు" అని పిలవబడే మహానుభావుడుఊరుకోడని అర్ధమైపోయింది. "హూమ్ఁ..." అని నిట్టూర్చి, కిందకిదిగుతుండగా సెల్ మోగింది. చూస్తే, మా శ్రీవారు కాల్ చేస్తున్నరు. ఒకసారిమూతితిప్పుకొని, ఆన్సర్ చేసా "హలో.." అనీ. " ఏంచేస్తున్నావురా నీరూ?" అన్నాడు ఆయన. మ్..పిలవడంముద్దుగానే పిలుస్తాడు. కానీ ఆ ముద్దుచేతల్లో మాత్రం ఉండడం లేదు, అనుకొని"ఏమీ లేదు శ్రీవారూ, తమరుఎప్పుడు కరుణిస్తారో అని వెయిట్ చేస్తున్నా." అన్నా విసుగ్గా. ఆయన నవ్వేస్తూ "సరే, అలాగే ఒకగంట సేపు వెయిట్చెయ్, వచ్చేస్తా." అని కాల్ కట్చేసాడు. నేను సెల్ వైపుఅలాగే చూస్తూ ఉండిపోయా, ఎందుకో. దాన్ని అలాగే చూస్తుంటే నాసమస్యకి ఒక పరిష్కారం తట్టింది. యెస్...అలా చేస్తే గురుడుడిఫినెట్ గా దారిలోకి వస్తాడు. రేపట్నుండే నాకు వచ్చిన ఆలోచననిఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నా. హుషారుగా మళ్ళీ మేడ ఎక్కేసి, చందమామ తో, మల్లెపూలతో చెప్పేసా...ఇక మీరెంతోకాలం హింసపెట్టలేరని. చందమామ నెమ్మదిగా మబ్బుల్లోకి పోయి దాక్కుండిపోయాడు. గాలివీచకపోవడం తో మల్లెవాసన కూడాతోక ముడిచింది. విజయగర్వంతో నేను ఇంట్లోకి పోయా. వంట పూర్తయ్యే సమయానికి ఇంట్లోకి అడుగుపెట్టారు శ్రీవారు. రాగానే నేరుగా వంటగదిలోకి వచ్చేసి, ముక్కు ఎగబీలుస్తూ "హబ్బా, స్మెల్ అదిరిపోతుంది. ఏం వండావేమిటీ..?" అంటూ గిన్నెలుకెలసాగాడు. వొళ్ళు మంటెక్కిపోయింది నాకు. ఇంత అందమైనపెళ్ళాం వంటగదిలో ఉంటే, ఏ మగాడైనాఏం చేయాలీ? వెనకనుండి కౌగిలించుకొని, అక్కడక్కడ, అనువైన చోట, అందమైన చోటతడమాలి. అవసరమైతే ఒక ముద్దో, ఒకగిచ్చుడో లేదా చిన్న కొరుకుడో. అవన్నీ మానేసి ఈ మహానుభావుడు గిన్నెలుతడుముకుంటున్నాడు. "చూస్తారా వాసుగా, రేపట్నుండి ఉంటుంది నీపని." అనుకుంటూ ఉండగానే ఫక్కున నవ్వు వచ్చేసింది. ఆయనఆశ్చర్యంగా నా వంక చూసి"ఎందుకు నవ్వుతున్నావే?" అన్నాడు. "ఏమీ లేదు మహాను’బావా’. మీరు అలా గిన్నెలు కెలుకుతుంటేనవ్వొచ్చింది. పదండి తినేద్దాం." అనిఆయన్ని వంటగదిలోంచి డైనింగ్ టేబుల్ దగ్గరకి గెంటాను. మొత్తానికి ఒక అరగంటలో తినేసి, పడక గదికి చేరాము. ఎప్పటిలాగే’ ఇస్తినమ్మా వాయనం...పుచ్చుకొంటినమ్మా వాయనం..’ టైపులో కార్యక్రమం పూర్తి చేసుకొని నిద్రపోయాము. ఆయన పొద్దున్న ఆఫీస్కి వెళుతుంటే పదివేలు కావాలని అడిగా. "అంత ఎందుకే?" అన్నాడాయన. "ఆఁ...నా బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి." అన్నా కచ్చిగా. ఆయననవ్వేసి " అయితే సరే, రాఏ.టి.ఎం లోడ్రాచేసి ఇస్తా." అని, కూడా తీసుకెళ్ళి, డ్రా చేసి ఇచ్చాడు. ఆయన్నిపంపించేసి ఇంటికి వచ్చేసి, కావలసిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని దగ్గర లోని ఒకసెల్ కంపెనీకి వెళ్ళి , అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి, ఒక సిమ్ కార్డ్తీసుకున్నా. దానితో పాటు ఒక సెల్ఫొన్ కూడా. వాళ్ళిచ్చిన అప్లికేషన్పూర్తిచేసి ఇచ్చా. అయితే ఆ అప్లికేషన్పూర్తిచేసే హడావుడిలో ఒక తప్పుచేసా. అందమైనతప్పు. అదేంటో తరువాత చెబుతా. సిమ్ ని ఫొన్లో వేసిచ్చి, మరో రెండు గంటలలోఏక్టివేట్ అవుతుందని చెప్పాడు షాప్ వాడు. థేంక్స్చెప్పి, ఇంటికి చేరుకున్నా. అది ఎప్పుడు ఏక్టివేట్అవుతుందా అన్న ధ్యాసలో కాలంచాలా భారంగా గడిచింది. మొత్తానికి ఓ మూడుగంటల తరువాతఏక్టివేట్ అయ్యింది. "ఒరే వాసుగా...నీప్రోగ్రామ్ స్టార్ట్ అయింది." అని మనసులో నవ్వుకుంటూ, ఆయనికి ఒక మెసేజ్ పంపా, "హాయ్...హౌ ఆర్ యు?" అని. ఒక నిమిషం తరువాతరిప్లై వచ్చింది "హు ఆర్ యు?" అని. ఇక మెసేజ్ లపరంపర మొదలయ్యింది. నేను: నాపేరు స్వప్న... ఆయన: ఓకె..వాట్ కెన్ఐ డు ఫర్ యు? నేను: మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మలని ఒకసరి కలవాలని ఉంది. ఆయన: సారీ, మీరు రాంగ్నంబర్ కి మెసేజ్ చేసారు. నా పేరు వాసు. నాకుపెళ్ళయింది. నేను: సో వాట్? నాకూ పెళ్ళయింది. పెళ్ళయితే ప్రేమించ కూడదా? ఆయన: సారీ, రాంగ్నంబరే కాదు, రాంగ్ పెర్సన్ని ఎప్రోచ్ అయ్యారు మీరు. నేను: ఒక్కసారినన్ను కలవండి. నా పెర్సనాలిటీ చూస్తేమీరు షాక్ అవుతారు. ఆయన: మీరు మిస్ ఇండియా అయినాఐ డోంట్ కేర్. ఒకసారిమా ఆవిడని చూడండి. ఖచ్చితంగా తన కంటే అందంగాఉండరు మీరు. (ఒక్కసారిగా సిగ్గేసి, మురిసిపోయాను. "అబ్బాయి గారికి నా పెర్సనాలిటీ ఇంకానచ్చుతుందన్న మాట." అనుకొని, మళ్ళీ మెసేజ్ పెట్టాను.) నేను: ప్లీజండీ...మీరంటే పిచ్చి నాకు. ఆయన: సారీ, పిచ్చోళ్ళంటే భయం నాకు. ( ఫక్కుననవ్వొచ్చింది నాకు. మళ్ళీ మెసేజ్పెట్టా..) నేను: ప్లీజ్..ప్లీజ్...ప్లీజ్.. అంతే ఆ తరువాతమళ్ళీ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా, ఆయన దగ్గరనుండీ మెసేజ్రాలేదు నాకు. ముందు ఆనందంవేసింది, ఒక స్త్రీ టెంప్ట్చేస్తున్నా మా ఆయన లొంగలేదని. తరువాత చిరాకు వచ్చింది, నా మొగుడు ఇంతపప్పు సుద్ద ఏమిటా అని. అంతలోనే నా ఈగో కూడాహర్ట్ అయ్యింది, మా ఆయన నాకుపడడా అని. "ఎలాగైనా పడగొట్టి తీరుతా నిన్ను వాసుగా." అనుకున్నా కచ్చిగా.... (Written by Mango Shilpa - To be continued in Part-02)
నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్... Part-01
in
Telugu
- on Sunday, November 02, 2014
- No comments
Post a Comment