అది ఒక మెటల్ బాక్స్ . అడుగున్నర పొడవూ , అడుగు వెడల్పూ , తొమ్మిదంగుళాల లోతూ ఉంది . నవీన్ ఇద్దరి వైపూ ఒక సారి చూసి , మెల్లగా ఆ బాక్స్ ను తన చేతిలోకి తీసుకొని , పైకి తన చేతిని అందించాడు . ఇద్దరూ కలసి అతన్ని పైకి లాగి , క్యూరియస్ గా ఆ బాక్స్ ను తీసుకొని పరిశీలించారు . ముగ్గురూ కలసి మార్చిమార్చి పరిశీలించినా , అసలు దాన్ని ఎటువైపు నుండి ఓపెన్ చేయాలో అర్ధం కాలేదు . అంతలో సన్నగా వర్షం మొదలయ్యింది . “ సరే ! నా రూంకి పోయి దీని సంగతి చూద్దాం , పదండి .” అన్నాడు నవీన్ . ముగ్గురు కలసి , ఒక ఆటోలో హోటల్ కి చేరుకున్నారు . తన రూంలోకి వెళ్ళగానే రవీ , రమేష్ ఆ బాక్స్ ను పట్టుకొని మంచం ఎక్కేసారు . నవీన్ జాగ్రత్తగా డోర్ బోల్ట్ వేసేసి , వాళ్ళతో జాయిన్ అయ్యాడు . జాగ్రత్తగా ఒక్కో అంగుళం పరిశీలిస్తే , ఒక మూలన చిన్న బొడిపె లాంటిది కనిపించింది . దాన్ని నొక్కగానే స్ప్రింగ్ ఏక్షన్ లో దాని మూత తెరుచుకుంది .
All types of stories in all languages